సోమవారం, 09 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐనవోలులో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి

2 గంటల క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 06:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-తుళ్లూరు : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలులో విషాదం చోటుచేసుకుంది. వీఐటీ (VIT) యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ధ్యానేష్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎంహెచ్‌-4 భవనంలోని నాలుగో అంతస్తులోని హాస్టల్‌లో ఉంటున్న ధ్యానేష్‌ మృతదేహం మొదటి అంతస్తులో గుర్తించారు. విద్యార్థి మృతిపై తోటి విద్యార్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న తుళ్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్