గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్కూల్‌ బస్సు బోల్తా

56 నిమిషాల క్రితం

bus
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 11:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్‌.. తప్పిన పెను ప్రమాదం

ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం: అనంతలక్ష్మి పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా బోల్తా పడింది. నార్పల, బుక్కరాయసముద్రం మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకుని సిద్దులాపల్లి నుంచి బుక్కరాయసముద్రం వైపు బస్సు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వర్షాల కారణంగా రోడ్డు పక్కన ఉన్న మట్టి మెత్తబడటంతో బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా పక్కకు ఒరిగి బోల్తా పడినట్లు డైవర్‌ తెలిపారు. ఆయన అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును నిలిపివేయడంతో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సులో సుమారు 25 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) అక్కడికి చేరుకుని బస్సును, ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్