గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో జార్ఖండ్‌ మంత్రి కుమార్తె సహా నలుగురు మృతి

57 నిమిషాల క్రితం

Jharkhand Minister
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 12:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాంచీ : జార్ఖండ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత దీపక్‌ పాండే సింగ్‌ కుమార్తె త్రిషా సింగ్‌ సహా మరో ముగ్గురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. రాంచీ -జంషెడ్‌పూర్‌ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ మరణాలను జార్ఖండ్‌ ఆరోగ్యమంత్రి ఇర్ఫాన్‌ అన్సారీ ధృవీకరించారు. ‘‘ఈ ఉదయం జంషెడ్‌పూర్‌లోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో జార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దీపికా పాండే కుమార్తె మరణించారనే వార్త తెలిసింది. దీపికా పాండే, వారి కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటిస్తున్నాను’’ అని ఇర్ఫాన్‌ అన్సారీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సహా పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

వివరాల ప్రకారం.. త్రిషా సింగ్‌ సహా నలుగురు ప్రయాణిస్తున్న రోడ్డు పక్కన ఆగి వున్న ట్రక్కును ఢీకొట్టింది. స్థానికులు, పోలీసులు కలిసి గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి కారును కోసి, వాహనంలో ఉన్న నలుగురినీ బయటకు తీశారు. పోలీసులు నలుగురినీ మహాత్మా గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వారు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదం జంషెడ్‌పూర్‌లోని సోనారి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే దొముహాని మెరైన్ డ్రైవ్ సమీపంలో జరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్