తెలంగాణ : హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో దారుణ ఘటన జరిగింది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... బాధితురాలు రోజువారీ విధుల్లో భాగంగా రాత్రి సమయంలో తన ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు క్యాబ్‌లో బయలుదేరారు. మార్గమధ్యలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపానికి చేరుకోగానే, నిందితుడు క్యాబ్‌ను నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించాడు. అనంతరం కారులోనే ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అయితే, బాధితురాలు ఏమాత్రం అధైర్యపడకుండా తీవ్రంగా ప్రతిఘటించి, అతడి బారి నుంచి తన్ను తాను రక్షించుకున్నారు. ఆమె తిరగబడడంతో భయాందోళనకు గురైన డ్రైవరు, కారుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ భయానక ఉదంతం అనంతరం బాధితురాలు శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్టు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఆధారాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న క్యాబ్ డ్రైవర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఎయిర్‌పోర్టు మార్గంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ ఘోర ఘటన వెలుగులోకి రావడంతో విమానాశ్రయ అధికారులు తీవ్రంగా స్పందించారు. ఎయిర్‌పోర్టులో పనిచేసే ఉద్యోగులు, ముఖ్యంగా మహిళా సిబ్బంది రవాణా, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. విధులకు వచ్చే మహిళల రక్షణకు మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని, క్యాబ్ సర్వీసుల వెరిఫికేషన్‌ను కఠినతరం చేయాలని నిర్ణయించారు.
ఇండిగో ఉద్యోగిని పై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 10:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)