గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మొబైల్ ఫోన్ ద్వారానే కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు

1 గంట క్రితం

caste
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 09:20 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రీ ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స‌ర్వీసు అందుబాటులో ఉంద‌న్న ఆర్టీజీఎస్‌

అమ‌రావ‌తి: మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా పౌరులు త‌మ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు పొందే స‌దుపాయాన్ని క‌ల్పించిన‌ట్లు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. పౌరులు త‌మ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను త‌మ‌కు కావాల్సిన‌ప్పుడు ఏ ప్ర‌భుత్వ కార్యాలయానికి వెళ్ల‌న‌వ‌స‌రం లేకుండా తామున్న చోటు నుంచే త‌మ మొబైల్‌ఫోన్ ద్వారా డౌన్‌లోడు చేసుకోవ‌చ్చ‌ని ఆర్టీజీఎస్ తెలిపింది. మ‌న‌మిత్రలోని రెవెన్యూ సేవ‌ల విభాగంలో పౌరులు రీ ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స‌ర్టిఫికెట్స్ విభాగాన్ని ఎంపిక చేసుకుని అందులో త‌మ ఆధార్ నంబ‌రు పొందుప‌రిచి ఓటీపీ పొందాలి. ఈ ఓటీపి అందులో న‌మోదు చేసిన త‌ర్వాత కొన్ని వివ‌రాల‌ను నింపాలి. త‌ర్వాత కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం పొంద‌డానికి కావాల్సిన రూ.40ల రుసుమును వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారానే చెల్లించ‌వ‌చ్చు. ఒక‌సారి చెల్లింపు అయిన త‌ర్వాతు వాట్సాప్‌లో మీ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం డౌన్లోడు చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు జారీ అయిన వారు త‌మ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను వాట్సాప్ ద్వారా త‌మ‌కు కావాల్సిన స‌మ‌యంలో కావాల్సిన చోట డౌన్లోడు చేసుకోవ‌చ్చు. ప్ర‌తి సారీ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం కోసం రెవెన్యూ కార్యాల‌యాలు, స్వ‌ర్ణ గ్రామ‌, స్వ‌ర్ణ వార్డు స‌చివాల‌యాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ స‌దుపాయం ఇప్ప‌టిక కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు పొందిన‌వారికి క‌ల్పిస్తున్నామ‌ని త్వ‌ర‌లో మ‌న‌మిత్ర ద్వారా కొత్త‌గా కుల ధృవీక‌ర‌ణ‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుని పొందే స‌దుపాయం కూడా క‌ల్పించ‌నున్న‌ట్లు ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.

ఇలా ఉప‌యోగించాలి

1: మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ నంబ‌రు 9552300009 కు హాయ్ అని మెసేజ్ పంపాలి

2: సేవ‌ను ఎంచుకోండి అనే అప్ఫ‌న్ ఎంపిక చేసుకోవాలి

3: రెవెన్యూ సేవ‌ల ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి

4: రీ-ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స‌ర్టిఫికెట్లు ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి

5: మీ ఆధార్ నంబ‌రు టైపు చేయాలి

6: మీ మొబైల్‌కు వ‌చ్చిన ఓటీపీని ఓటీవీ అడిగిన చోట టైపు చేయాలి

7: ఆధార్ డెమోగ్రాఫిక్స్ రివ్యూలో అడిగిన వివరాలు పొందుపరచాలి

8: కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం పొంద‌డానికి రూ.40 రుసుం చెల్లించాలి

9: ఈ డ‌బ్బు చెల్లించ‌డానికి ఉన్న పేమెంట్ గేట్ వే ద్వారా చెల్లించాలి

10: మీ కుల ధృవీక‌ర‌ణ ప‌త్రం పీడీఎఫ్ డౌన్లోడు వ‌స్తుంది

11: దాన్ని మీరు ప్రింట్ లేదా డౌన్లోడు చేసుకోవ‌చ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్