శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

20న సర్టిఫికెట్ల వెరఫికేషన్

1 గంట క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 10:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​సైనిక సంక్షేమ అధికారి పోస్టుకు ఈనెల 20న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఎపిపిఎస్ సి) కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికకెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారని అ సంస్థ కార్యదర్శి తెలిపారు. 20న ఉదయం10 గంటలకు ఎపిపిఎస్ సి కార్యాలయం, 2వ అంతస్తు, కొత్త హెచ్ ఒడి భవనం, ఎంజి. రోడ్, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా, విజయవాడలో హాజరు కావాలని పేర్కొన్నారు. అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ నుంచచి చెక్ లిస్ట్, అటెస్టేషన్ ఫారాలు, మెమోలో పేర్కొన్న ఇతర సంబంధిత ఫారాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు వ్యక్తిగత కాల్ లెటర్లు విడివిడిగా పంపబడతాయని తెలిపారు. కాల్ లెటర్ అందకపోయయినా, వారు కమిషన్ వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్, మెమోను డౌన్‌లోడ్ చేసుకొని, కమిషన్ కార్యాలయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు.

​20న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుకు...

​డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుకు ఈనెల 20న ఎపిపిఎస్ సి కార్యాలయంలో సర్టిషికెట్ల వెరఫికేషన్ ను నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అనంతరం అదే రోజు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సిపిటి) ఉంటుందని పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ నుంచి మెమో,కాల్ లెటర్, రెండు సెట్ల చెక్ లిస్టులు, రెండు సెట్ల అటెస్టేషన్ ఫారాలు, ఇతర సంబంధిత పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులకు వ్యక్తిగత కాల్ లెటర్లు విడివిడిగా పంపబడతాయని, వారికి కాల్ లెటర్ అందకపోయయినా, వారు కమిషన్ వెబ్‌సైట్ నుంచచి కాల్ లెటర్, మెమోను డౌన్‌లోడ్ చేసుకొని, దానిని సక్రమంగా పూరించి, వెరిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం కమిషన్ కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొన్నారు.

​జూనియర్ లెక్చరర్ జాబితా విడుదల

​రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా సేవలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో జూనియర్ లెక్చరర్ (ఎకనామిక్స్) పోస్టుల (పరిమిత నియామకం) భర్తీకి సంబంధించి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. ఈ జాబితా కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in లో అందుబాటులో ఉందని తెలిపారు.

అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల జాబితా విడుదల

వివిధ ఇంజినీరింగ్ సబార్డినేట్ సర్వీసులలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి (సాధారణ,పరిమిత నియామకం) సంబంధించి తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.ఈ జాబితా కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

23న సర్టిఫికెట్ల వెరఫికేషన్

ఆంధ్రప్రదేశ్ భూగర్భ జల సబార్డినేట్ సర్వీస్‌లో టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్) పోస్టుకు ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు తాత్కాలికంగా అడ్మిట్ అయిన అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.in లో ఉందని అధికారులు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఈనెల 23న ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం, కొత్త హెచ్ఒడి భవనం, 2వ అంతస్తు, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా, ఎం.జి. రోడ్, విజయవాడ లో జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్