ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబిజెపి వలలో చంద్రబాబు

16 జులై, 2026

cpi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 10:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిపిఐ రాష్ర్ట కార్యదర్శి జి.ఈశ్వరయ్య

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తోందని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ...దళితులు, ఆదివాసులు, గిరిజనులు, జర్నలిస్టులు, యూట్యూబర్ల పై పెద్దఎత్తున దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు బిజెపి వలలో పడ్డారని.... రాష్ట్రంలో పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సంఘ విద్రోహశక్తులు, దేశ ద్రోహులుపై పెట్టాల్సిన ఉపా చట్టాన్ని కేవలం డిప్యూటీ సిఎం మాటలను అనుకరించిన రావణ్‌పై పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై చంద్రబాబుకు గౌరవం ఉంటే తక్షణమే ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా విచ్చలవిడిగా మారిపోయిన పరిస్థితులలో మీ అలయన్స్ పార్టీల సోషల్‌ ‌మీడియాపై కూడా దృష్టి పెట్టాలని చంద్రబాబుకు సూచించారు. ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగుచుక్ 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.వాంగుచుక్ దీక్షకు సిపిఐ మద్దతు తెలియజేస్తోందన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్