మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి

4 రోజుల క్రితం

Do not fall into the 'Axe Party's' trap: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టి ఏడాదైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం మహిళలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. “స్త్రీ శక్తికి సంవత్సరం, రెట్టింపైన ఆత్మగౌరవం” పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాజధాని పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర్య దినోత్సవాల కార్యక్రమ అనంతరం “స్త్రీ శక్తికి సంవత్సరం, రెట్టింపైన ఆత్మగౌరవం” కార్యక్రమంలో సిఎం చంద్రబాబు పాల్గొననున్నారు. పరేడ్ గ్రౌండ్ నుంచి సిఎం క్యాంప్ కార్యాలయం వరకు స్త్రీశక్తి లబ్దిదారులతో కలిసి బస్సులో ముఖ్యమంత్రి ప్రయాణించనున్నారు. క్యాంప్ కార్యాలయంలో మహిళలతో కలిసి హై-టీలో పాల్గొననున్నారు. పథకం అమలవుతున్న తీరు, కలుగుతున్న లబ్ది వంటి అంశాలపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. స్త్రీ శక్తి పథకం ప్రాంరంభం నాటి నుంచి ఇప్పటి వరకు 87 కోట్ల ప్రయాణాలను వివిధ వర్గాల మహిళలు చేశారు. మహిళల ప్రయాణానికి ప్రభుత్వం రోజుకు రూ.8.53 కోట్లను సబ్సిడీగా అందిస్తోంది. పథకం అమల్లోకి వచ్చిన ఏడాది కాలంలో ఇప్పటివరకు రూ.3,095 కోట్లు ఈ పథకానికి ప్రభుత్వం ఖర్చు పెట్టింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్