సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు మొగల్తూరుకు ముఖ్యమంత్రి

55 నిమిషాల క్రితం

Continue the search until the fishermen are traced: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటలకు అమరావతి నుంచి బయల్దేరి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చేరుకోనున్నారు. 11 గంటలకు నర్సాపురం చేరుకుని గోదావరి గట్టు సమీపంలోని 2,3 వార్డులతో పాటు పొన్నపల్లి లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్దిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారు. అనంతరం పెన్షన్ లబ్దిదారులతో ముచ్చటిస్తారు. అదేవిధంగా మొగల్తూరు ప్రజావేదిక సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ కేడర్ సమావేశంలోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారు. సాయంత్రం 5.20 గంటలకు అమరావతికి చేరుకోనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్