మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మాజీ మంత్రి అంబటి పై సిఐడి కేసు

31 జులై, 2026

rambabu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 31, 2026, 11:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సిఐడి అధికారులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ఎఐతో రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారనే ఆరోపణపై టిడిపి నాయకుడు మద్దిరాల మ్యాని శుక్రవారం మంగళగిరి డిజిపి కార్యాలయంలో అంబటిపై ఫిర్యాదు చేశారు. మ్యానీ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు కేసు నమోదు చేసి ఎఐ వీడియో పోస్టు వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. అంబటి అనుచరులు పెమ్మసాని చేతులకు బేడిలు వేసినట్టు ఎఐ వీడియో రూపొందించి పోస్టింగ్‌ ‌చేసినట్టు టిడిపి జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు కూడా అంబటిపై ఎస్‌‌పికి ఫిర్యాదు చేశారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్