తొలుత చంద్రశేఖర్, ఆ తర్వాత పరామర్శకు వెళ్లిన మణిని కూడా
ప్రజాశక్తి- చిట్వేల్ (తిరుపతి జిల్లా) : 'విబి గ్రామ్ జి` పథకం ప్రారంభోత్సవానికి తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లె గ్రామానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వస్తున్న నేపథ్యంలో రైల్వేకోడూరులో సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ చంద్రశేఖర్ ను గురువారం తెల్లవారుజాము నుంచే పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచి ఉదయాన్నే అరెస్టు చేసి చిట్వేల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. చంద్రశేఖర్ ను పోలీసు స్టేషన్లో పరామర్శించేందుకు వెళ్లిన ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి పందికాళ్ల మణిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. సిఎం సభ కార్యక్రమం ముగిసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. బైరైటీస్ గనులను కాపాడాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని పోరాడుతున్న తమను అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని వారు అన్నారు. వీరి అక్రమ అరెస్టులను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి.నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి ఖండించారు.








కామెంట్‌లు (0)