ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలు..
బాపట్ల ప్రభుత్వాస్పత్రికి తరలింపు
ప్రజాశక్తి-గుంటూరు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం రేటూరు గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రేటూరు ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు గ్రామంలో సంబరాలు నిర్వహిస్తున్నాయి. ఈ సమయంలో అటువైపుగా వస్తున్న వైసీపీ అభ్యర్థితో కార్యకర్తలకు వాగ్వాదం చోటుచేసుకుని, అది ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేస్తున్నట్లు కాకుమాను ఎస్‌ఐ హరికృష్ణ తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.








కామెంట్‌లు (0)