ప్రజాశక్తి-అమరావతి : ప్రముఖ గాయని ఎస్. జానకి (88) మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేశ్ లు సంతాపం తెలిపారు. దక్షిణాది గానకోకిల జానకి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసమైనమైన ప్రతిభతో, తన అమరగానంతో ఎన్నో తరాలను మురిపించిన ఆ గాత్రం మూగబోవడం బాధాకరమన్నారు. సంగీత ప్రపంచానికి ఆమె అందించిన సేవలు శాశ్వతంగా ఉంటాయన్నారు. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. జానకి కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గాయని జానకి మరణం పట్ల సీఎం చంద్రబాబు, ఏపీ మంత్రుల సంతాపం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 12, 2026, 10:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)