ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి

2 గంటల క్రితం

Two laborers killed in road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 11:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఎపి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ను గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో దేవరపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలు శ్రీను (39), కడలి రాజేంద్ర (32) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్