ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వియత్నాం బోటు ప్రమాదం.. బాధితులకు పూర్తి సహాయం ఆదేశం

1 గంట క్రితం

boat acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 11:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : వియత్నాంలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. బాధితులను సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు, మృతదేహాలను త్వరితగతిన స్వదేశానికి తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు వియత్నాం ప్రభుత్వ అధికారులు, అక్కడి భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
రాష్ట్రం నుంచి మొత్తం 33 మంది వియత్నాం పర్యటనకు వెళ్లగా, వారిలో 19 మంది ప్రమాదానికి గురైన బోటులో ఉన్నారు. ఈ ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ముడియం శ్రీధర్, కృష్ణా జిల్లాకు చెందిన గెల్లి జయలక్ష్మి, సత్యసాయి జిల్లాకు చెందిన నల్లపేట ఆదిశేషయ్య రవి తేజ మృతి చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన గెల్లి కిశోర్ తీవ్ర అస్వస్థతతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారందరూ సురక్షితంగా ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్