అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధానికి అభినందనలు తెలియజేశారు. భారత్కు సరైన సమయంలో సరైన నాయకుడిగా నరేంద్ర మోడీ ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. మోడీ విజన్తో దేశం ‘వికసిత్ భారత్ @ 2047’ లక్ష్యం దిశగా వేగంగా పయనిస్తోందని అన్నారు. సుదీర్ఘ ప్రజా సేవలో భాగమైన మోదీతో కలిసి పనిచేయడం తనకు గర్వకారణమని తెలిపారు. కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల ద్వారా అభివృద్ధి, పెట్టుబడులకు సరికొత్త వేగం వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని సహకారంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ ప్రజలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నామని వెల్లడించారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలో బలమైన భారత్తో పాటు సుసంపన్నమైన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రధానిగా మోడీ మరిన్ని విజయాలు సాధించి దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.








కామెంట్లు (0)