హరారే వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు కొల్పొయి చేదించింది. చేదనలో వైభవ్ సూర్యవంశీ (50; 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. మిగతా బ్యాటర్లలో ఇషాన్ కిషాన్ 24 బంతుల్లో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 28, తిలక్ వర్మ 6 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అభిషేక్ శర్మ 1 పరుగు చేసి నిరాశ పరిచాడు. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ 2, రిచర్డ్ నగరవ దీవెన 1 వికెట్ తీశారు.
ఈ మ్యాచ్లో తొలుత భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్లు చెలరేగడంతో జింబాబ్వే జట్టు 125 పరుగులకే పరిమతమైంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత బౌలర్లు ప్రత్యర్థి టాప్ ఆర్డర్‌ను వరుసగా పెవిలియన్‌కు పంపించి మ్యాచ్‌పై పట్టు సాధించారు. జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ డకౌట్‌గా వెనుదిరగగా, బెన్ కరన్ (10) పరుగులు, డియాన్ మేయర్స్ 6 పరుగులు మాత్రమే చేశారు. కెప్టెన్ సికందర్ రజా కూడా కేవలం 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. భారత బౌలర్ల కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ ముందు జింబాబ్వే బ్యాటర్లు నిలదొక్కుకోలేక వరుసగా వికెట్లు కోల్పోయారు. రయాన్ బర్ల్ (26) వెస్లీ మాధవేరే (39) తడివానషే మరుమాని (27),బ్రాడ్ ఎవాన్స్ (0), న్యూమాన్ న్యామ్‌హురి (1) పరుగులు చేశారు. భారత బౌలర్లలో యాంక్ యాదవ్ 2, ప్రిన్స్ యాదవ్ 2, రవి , శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు.







కామెంట్‌లు (0)