2027 జూన్ 9 నుంచి 13 వరకు ఫైనల్ మ్యాచ్
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2027 ఫైనల్‌కు వేదిక ఖరారైంది. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు లండన్‌లోని చారిత్రక ఓవల్ మైదానం మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 2027 జూన్ 9 నుంచి 13 వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుందని ఐసీసీ నేడు అధికారికంగా ప్రకటించింది. ఓవల్ మైదానం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. 2023లో జరిగిన ఫైనల్ కూడా ఇక్కడే జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 2025లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో రాబోయే మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ (2027, 2029, 2031) నిర్వహించే హక్కులను ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దక్కించుకుంది. ఇందులో భాగంగానే 2027 ఫైనల్‌కు ఓవల్‌ను ఎంపిక చేశారు. 2025 ఫైనల్ లార్డ్స్‌లో జరగ్గా, ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే..







కామెంట్‌లు (0)