ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆక్వా రంగాన్ని ఆదుకోండి

5 రోజుల క్రితం

We will provide rehabilitation to farmers affected by the Veligonda project: CM Chandrababu.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 10:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కేంద్రమంత్రులకు సిఎం చంద్రబాబు లేఖ

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు కేంద్రమంత్రులకు విడివిడిగా సోమవారం లేఖలు రాశారు. జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీ దారులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌‌ను లేఖలో కోరారు. రొయ్యల మేత తయారీలో ప్రధాన ముడిసరుకైన సోయాబీన్ మీల్ ధరలు విపరీతంగా పెరగడంతో, మేత తయారీ ఖర్చులు పెరిగాయని వివరించారు. దీనివల్ల రొయ్యల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయటంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీయ మత్య్స అభివృద్ధి బోర్డు కార్యాలయం అమరావతిలో ఏర్పాటు చేయాలని మరో లేఖలో మంత్రిని కోరారు.

ఇదే అంశంపై కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్‌‌కు మరో లేఖ రాశారు. ఎపి నుంచి ఎఫ్‌సిపి పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఆక్వా కల్చర్ ఏరియేటర్లపై జిఎస్టిని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరుతూ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరో లేఖ రాశారు. భారత- అమెరికా వాణిజ్య ఒప్పందంతో ఆక్వా దిగుమతులపై సుంకం 10 శాతానికి తగ్గినా ఇంకా చట్టపరమైన అనిశ్చితి కొనసాగుతోందని, టారిఫ్ సంక్షోభంపై జోక్యం చేసుకోవాలని కోరారు. కిసాన్ క్రెడిట్ కార్డు పై రూ.5 లక్షల వరకూ వన్ టైమ్ టాప్ అప్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్