రాజమండ్రి : మూడు జిల్లాల పర్యటనలో భాగంగా సిఎం చంద్రబాబు సోమవారం రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పునరుద్దరణ పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 2014-19 మధ్య కాలంలో ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను అప్పటి టిడిపి ప్రభుత్వం అమర్చింది. ఇప్పుడు సీడబ్ల్యూసీ సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో సిఎం చర్చించారు. వచ్చే ఏడాది జూన్ నెల నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్దం చేస్తామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.
రాజమండ్రిలో సిఎం చంద్రబాబు పర్యటన - ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 01:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)