మేడారం : ములుగు జిల్లా మేడారంలో ఆదివారం సిఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. నేడు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. చేయూత పింఛన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. మేడారం చేరుకున్న ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. పూజారులు గిరిజన సంస్కృతి, సంప్రదాయాల నడుమ డోలు వాయిద్యాలతో ఆలయ ప్రాంగణంలోకి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం, చీర, సారె, పసుపు, కుంకుమలను సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సిఎంతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. వన దేవతల సమక్షంలో సీఎం, మంత్రులకు సీతక్క రాఖీలు కట్టారు.
మేడారంలో సిఎం రేవంత్ రెడ్డి పర్యటన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 04:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)