సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రచనా వ్యాసంగానికి జానకమ్మ సహకారం మరువలేనిది

16 ఆగస్టు, 2026

ganteda
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 05:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- గంటేడ జానకమ్మ సంస్మరణ సభలో వక్తలు

ప్రజాశక్తి - పార్వతీపురం : ప్రముఖ కథా రచయిత, కవి, విశ్లేషకులు గాయకులు, కళాకారులు గంటేడ గౌరునాయుడు భార్య జానకమ్మ ఇటీవల మృతి చెందగా ఆదివారం నాడు దళాయిపేట గ్రామములో సంస్మరణ సభను సాహితి ప్రముఖుల సమక్షంలో నిర్వహించారు. సమాజానికి కవులు, రచయితలు, కళాకారుల ప్రతిభ ప్రత్యక్షంగా కనిపిస్తుందనీకానీ వారిని అనుక్షణం ప్రోత్సహించి ముందుకు నడిపించే వారి జీవిత భాగస్వామి అందించే సేవలు చాలా విలువైనవని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాజీ అన్నారు. ప్రముఖ సాహితీవేత్త గంటేడ గౌరునాయుడు సతీమణి జానకమ్మ సంస్మరణసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జానకమ్మ ఆకస్మిక మృతితో రచయిత గౌరునాయుడు మనస్సును దృఢంగా చేసుకొని సాహితీ ప్రపంచాన్ని ముందుకు నడపాలి అన్నారు. పార్వతీపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ డాక్టర్ బి. వెంకటరావు మాట్లాడుతూ గంటేడ రచనా వ్యాసంగానికి జానకమ్మ అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. పార్వతీపురంలో రచయితలు పెరగడంలో ఆమె సహకారం కూడా మరువలేనిదన్నారు. ఈసమావేశంలో కురుపాం మండలపరిషత్ అధ్యక్షురాలు శెట్టి కళావతి, కొమరాడ మండలాధ్యక్షురాలు శ్యామలలు మాట్లాడుతూ జానకమ్మ మరణం గంటేడ కుటుంబాన్నే కాదు ఈప్రాంతంలో వున్న ఎంతోమంది సాహిత్యాభిమానులను కలచివేసిందని అన్నారు. పక్కి రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన సంస్మరణ కార్యక్రమంలో వాన మోహనరావు, మంతిని సుశీలలు పాడిన పాటలు అందరిని కన్నీటి పెట్టాయి. ఈసమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ మంచిపల్లి శ్రీరాములు,మంతిన సుశీల, గడగమ్మ రామకృష్ణ,చింత అప్పలనాయుడు, సిరికి స్వామినాయుడు, రౌతు వాసుదేవరావు, వావిలపల్లి మోహన్, రౌతు విజయ్ కుమార్, మామిడి క్రాంతి, రౌతు బంగారునాయుడు, చందనపల్లి గోపాలరావు, దొడ్లంకి గణపతిరావు, వంజరాపు శేషు, పొట్నూరు చిన్నంనాయుడు, గంటేడ చిన్నంనాయుడు, గంటేడ మన్మధరావు,గంటేడ సోమేశ్వరరావు, కిరణ్ కుమార్, క్రాంతి కుమార్, ఆల్తిమోహన్, పొదిలాపు శ్రీను చదలవాడ సత్యనారాయణ, చుక్క పారినాయుడు, బోనెల పరశురాం, తదితరులు హాజరై ప్రసంగించారు. సుమారు మూడు గంటల పాటు సాహిత్య ప్రముఖులందరూ జానకమ్మను స్మరిస్తూ గౌరు నాయుడుకు ధైర్యాన్ని తెలియజేసి, ఆయనకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గౌరునాయుడు మిత్రులు, బంధువులు స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి తననాయకులతో కలిసి విచ్చేసి గంటేడ జానకమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గంటేడ గౌరు నాయుడును, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్