ప్రజాశక్తి - వేపాడ : బక్కు నాయుడుపేట వద్ద గల బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం, కేజీబీవీ బాలికల వసతిగృహాలను డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారము భోజన సదుపాయము లేదని కొంతమంది పేరెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన తనిఖీ చేపట్టారు. విద్యార్థులతో గొంప కృష్ణ మాట్లాడుతూ.. మీకు సక్రమంగా భోజనాలు అందుతున్నాయా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తమ గదుల్లో విద్యుత్ సౌకర్యము లేదని, ఫ్యానులు కూడా ఏర్పాటు చేయలేదని విద్యార్థులు ఆయనకు తెలిపారు. స్పందించిన కృష్ణ విద్యార్థుల గదులను పరిశీలించారు. ఏడుగదుల్లో మూడు గదులకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వ శిక్ష అభియాన్ అధికారితో సంప్రదించి మీ పిల్లలు ఇదే విధంగా చదువుతున్నారా ఇదేమి న్యాయమని సర్వశిక్ష అభియాన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గదులకు వెంటనే విద్యుత్ సౌకర్యము కల్పించాలని ఆదేశించారు. అనంతరం కేజీబీవీ వసతి గృహములోనూ, బి ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికలు వసతి గృహములోనూ పూర్తిస్థాయిలో విద్యార్థులకు విద్యుత్ సౌకర్యం నకు అవసరమైన సదుపాయాల జాబితాను అందించాలని కోరారు. పనులు పూర్తి చేయించే బాధ్యతను అధికారి గుమ్మడి భారతికి అప్పగించారు. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహములో కూడా సదుపాయాలను కల్పించాల్సిందిగా ఆదేశించారు.
వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిసిఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)