బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition ఐఎఎస్‌ వికాస్ వ్యవహారంపై నివేదిక కోరిన సిఎం

1 గంట క్రితం

ias vikas.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 10:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : బెంగళూరు పబ్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐఎఎస్‌, కుప్పం ఏరియా డెవలప్‌‌మెంట్‌ అథారిటీ (కడ) ప్రత్యేక అధికారి వికాస్‌ మర్మత్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సిఎస్‌‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సిఎస్‌ ‌నుంచి పిలుపురావడంతో విజయవాడకు చేరుకున్న వికాస్ మర్మత్ సిఎస్ ఎదుట సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, దుర్భాషలాడడం, దాడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలతో ఆయనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

గుర్తింపు కార్డు అడిగితే వాగ్వాదం!

బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న కావోర్‌_ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో అక్టోబర్‌ పది తెల్లవారుజామున బెంగళూరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కస్టమర్ల వయస్సును నిర్ధారించేందుకు గుర్తింపు కార్డులను పరిశీలిస్తుండగా వికాస్‌ ‌మర్మత్‌తో పాటు అభయ్‌ ఉదయ్‌సింగ్‌, నితీష్‌, రోషన్‌.. ‌పోలీసులతో వాగ్వాదానికి దిగి, దుర్భాషలాడటంతోపాటు దాడికి పాల్పడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు. సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ ప్రత్యేక విభాగానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ అరుణ్‌ సాలుంకే ఫిర్యాదు మేరకు కబ్బన్‌ పార్క్‌ పోలీసులు వికాస్‌ మర్మత్‌తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్