బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionగ్రామీణ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ‘సరస్’ అద్భుత వేదిక

1 గంట క్రితం

kondapalli.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నేడు ప్రారంభించనున్న రాష్ట్రపతి

  • కేంద్ర మంత్రి పెమ్మ‌సానితో క‌లిసి ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి కొండ‌ప‌ల్లి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళా సాధికారత, గ్రామీణ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి ‘సరస్’ అద్భుత వేదిక అని ఎంఎస్‌ఎంఇ, గ్రామీణ పేదరిక నిర్మూలనశాఖల మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో రాష్ట్రపతి ప్రారంభించనున్న ‘నేషనల్ సరస్ మేళా’ ఏర్పాట్లను మంత్రి కొండపల్లి, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. అనంత‌రం మంత్రి కొండ‌ప‌ల్లి మీడియాతో ‌మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తమ స్వగ్రామాల్లో ఉత్పత్తులు తయారుచేసే మహిళలు ఈ మేళా ద్వారా విజయవంతంగా విక్ర‌యించ‌డం ద్వారా ఆర్థికంగా నిల‌దొక్కుకోవ‌డంతో పాటు ఆత్మ‌విశ్వాసాన్ని పొందుతార‌ని తెలిపారు. వీరి స్ఫూర్తితో గ్రామాల్లో మ‌రికొంత మంది మ‌హిళ‌లు స్ఫూర్తి పొందే అవ‌కాశం కూడా ఉంటుంద‌న్నారు. ఉత్పత్తుల అసలు ధర నిర్ణయం, మార్కెట్‌లో ప్రజల కొనుగోలు శక్తి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై మహిళలకు ఈ మేళాతో అవగాహన క‌లుగుతుంద‌న్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్ల ద్వారా పారదర్శకంగా స్టాల్స్ కేటాయించి ద‌ళారి వ్యవస్థను పూర్తిగా తొలగించామ‌న్నారు. ఇతర రాష్ట్రాల మహిళల పనితీరును గమనించడంతో పాటు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘నాలెడ్జ్ సెంటర్’ ద్వారా ప్రభుత్వ పథకాలు, ప్యాకింగ్, బ్రాండింగ్, ప్రైసింగ్, ప్రాడక్ట్ ప్రమోషన్‌పై శిక్షణ ఇస్తున్న‌ట్టు తెలిపారు. గురువారం జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముతో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరవుతున్న‌ట్టు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్