బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడేటా సెంటర్లకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

1 గంట క్రితం

డేటా సెంటర్లకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 10:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆరిలోవ (విశాఖపట్నం) : విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఎఐ డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుధవారం గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. విశాఖలోని పాత డెయిరీ ఫామ్ వద్ద ఉన్న హెచ్‌పి గ్యాస్ గోడౌన్ నుండి రవీంద్ర నగర్ లాస్ట్ బస్‌‌స్టా‌ఫ్‌ వరకు ‌ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో రెండు వందల మందికి పైగా ప్రజలు, క్లైమేట్ యాక్షన్, కోయలిషన్ ఫర్ ఎఐ రెగ్యులేషన్ సంస్థల సభ్యులు పాల్గొన్నారు. జోరు వానలోనూ ర్యాలీ కొనసాగింది. ‘‘స్టాఫ్‌ వైజాగ్ డేటా సెంటర్- వైజాగ్ భవిష్యత్తును కాపాడుకుందాం’’ అంటూ నినాదాలు చేశారు. నల్ల దుస్తులు ధరించి దీనిని బ్లాక్ డే ఫర్ వైజాగ్‌గా పాటించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ విశాఖ గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ వి బైరాగిరెడ్డి, కార్యదర్శి డాక్టర్‌ ఎన్ చంద్రశేఖర్, కోశాధికారి కాంతారావు, పౌర చైతన్య వేదిక ‌ప్రతినిధి ప్రొఫెసర్ కొలవెన్ను చంద్, సిహెచ్ ప్రమీల, ఎస్ఎఫ్ఐ నాయకులు సాయితేజ, హెచ్ఆర్ఎఫ్ నాయకులు అనురాధ, జివిఎఫ్‌సి నాయకులు జయశ్రీ హటనగడి పాల్గొన్నారు.

డేటాసుర వధనం వీధి నాటకం ప్రదర్శన

​ర్యాలీ అనంతరం రవీంద్ర నగర్‌లో ‘డేటాసుర వధనం’ అనే వీధి నాటకాన్ని ప్రదర్శించారు. డేటా సెంటర్ల వల్ల నీటి వనరులకు, విద్యుత్తుకు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని ఈ నాటకం ద్వారా కళాకారులు కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ కార్యక్రమంలో దీక్ష, ఆశా, కె తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్