ప్రజాశక్తి - నిడదవోలు రూరల్ (తూర్పుగోదావరి జిల్లా) : కువైట్లో చిక్కుకుపోయిన మహిళ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చొరవతో స్వదేశానికి చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం మునిపల్లె గ్రామానికి చెందిన చింతల నాగలక్ష్మి ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లి అక్కడ ఒక ఇంట్లో పనిమనిషిగా చేరారు. ఈ నెల 11న ఆమె భర్త వెంకటేష్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమెకు బంధువులు తెలిపారు. భర్త మరణవార్త విన్న నాగలక్ష్మి భర్త కడసారి చూపు కోసం భారతదేశానికి వెళ్తానని కువైట్లోని ఆ ఇంటి యజమానిని కోరారు. దీంతో ఆ యజమాని నిరాకరించడంతో పాటు ఒకవేళ వెళ్లాలంటే రూ.మూడు లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫోన్ కాల్స్ కూడా మాట్లాడనివ్వకుండా నిర్బంధించారు. యజమానికి తెలియకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న తనను కాపాడాలంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేశారు. మంత్రి కందుల దుర్గేష్ దీనిపై స్పందించి విషయాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి దృష్టికి తీసుకెళ్లారు. ఒమన్లోని ఎపిఎన్ఆర్ టిఎస్ కో-ఆర్డినేటర్ నాగరాజుతో మాట్లాడారు. కువైట్ యంత్రాంగం అక్కడ భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి వీసా క్లియరెన్స్ పూర్తి చేయించారు. దీంతో నాగలక్ష్మి మంగళవారం విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. తన భర్త అంత్యక్రియలకు హాజరయ్యేలా చేసినందుకు మంత్రి కందుల దుర్గేష్, అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Print Editionస్వదేశానికి చేరిన కువైట్లో చిక్కుకున్న మహిళ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 14, 2026, 10:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)