సిఐటియు నాయకులకు జెఎసి ఆహ్వానం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఈ నెల 28న రాష్ట్రస్థాయి సదస్సుకు మద్దతివ్వాలని సిఐటియు, ఎఐటియుసి రాష్ట్ర నాయకత్వాన్ని ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ దామోదరరావు కోరారు. బుధవారం సిఐటియు కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు, నాయకులు కె సుబ్బరావమ్మ, ముజఫర్‌ను కలిసి ఆహ్వానం అందించారు. అలాగే ఎఐటియుసి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటసుబ్బయ్యను కలిసి ఉద్యోగ సదస్సుకు రావాలని ఆహ్వానించారు. నాయకులను కలిసిన వారిలో ఫణి పేర్రాజు, ఎన్‌టిఆర్ జిల్లా జెఎసి ఛైర్మన్ బత్తిన రామకృష్ణ ఉన్నారు.







కామెంట్‌లు (0)