శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

1,000 కోట్లతో పిఠాపురం సమగ్రంగా అభివృద్ధి

1 గంట క్రితం

pk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. రూ.1,000 కోట్లతో పిఠాపురం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతులు, ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అమరావతి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకమని ఆయన అన్నారు.పులివెందుల, డోన్ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతులకు సాగునీటి సౌకర్యం అందించడంతో పాటు రాష్ట్రంలో నీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 

ప్రజాస్వామ్యం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఇతరులను దూషించేందుకు లేదా కించపరిచేందుకు ఉపయోగించరాదని సూచించారు. సోషల్ మీడియాలో సమాచారాన్ని షేర్ చేసే ముందు దాని నిజానిజాలను ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని ప్రజలు, ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్