ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సింగీతం శ్రీనివాసరావు మృతికి సంతాపం

56 నిమిషాల క్రితం

singgitam.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026, 11:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ : ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో ఎన్నో సృజనాత్మక ప్రయోగాలు చేసిన సింగీతం శ్రీనివాసరావు సినీ రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.

సింగీతం శ్రీనివాసరావు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించి మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుతూ నాటక రంగంలో ప్రవేశం చేశారు. ఎటువంటి మాటలు లేకుండా కేవలం హావభావాలు పలికిస్తూ తీసిన ‘పుష్పక విమానం’ సినిమాతో రెండు జాతీయ పురస్కారాలతోపాటు ఐదు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఆయన సుదీర్ఘ ప్రయాణం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ బాషల్లో దర్శకత్వం వహించారు. 94 ఏళ్ళ వయస్సులో చివరి చిత్రం ‘సింగ్ గీతం’ అనే సినిమాని తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారన్నారు. ఆయన వైవిధ్య భరిత కథలతో సినీ ప్రియుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేవారని కొనియాడారు. చైన్నైలోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపాన్ని తెలియజేశారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్