ప్రజాశక్తి-తెనాలి : తెనాలి మండలం బుర్రిపాలెం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. గృహ నిర్మాణంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెంలో రూ.14 కోట్లతో 117 ఇళ్లను నిర్మించనున్నారు. 3డీ ప్రింటింగ్ విధానంలో ఒక్క ఇంటిని సుమారు 10 రోజుల్లో నిర్మించవచ్చని అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులోని ఇళ్లను ఆరు నెలల్లో పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
బుర్రిపాలెం నుంచి 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)