43 మందికి గాయాలు
ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు సమీపంలో పెళ్లి బృందం బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 65 మందికిపైగా ఉన్నారు. తునిలో వివాహ వేడుక ముగించుకుని కాకినాడ జిల్లా ఉప్పాడకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పెళ్ళి బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో అదుపు తప్పిన బస్సు.. పల్టీ కొట్టింది. కొందరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగులకొట్టి బయటపడ్డారు. ఉప్పాడకు చెందిన పెళ్లి బృందం తునిలో వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 43 మంది గాయపడగా.. తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.







కామెంట్‌లు (0)