అమరావతి : రాష్ట్రంలో ఎపిపిఎస్‌సి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెరిట్ ఆధారంగా నియామక ప్రక్రియ ఉండాలని ఈనెల 13, 14న జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేస్తూ తాజా జీవోను పశుసంవర్ధక శాఖ గురువారం విడుదల చేసింది.నోటిపికేషన్ విడుదలైన తర్వాత వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. అయితే సుదీర్ఘకాలంగా అనుసరిస్తున్న మెరిట్ ప్రాతిపదికన వెయిటేజ్ పద్ధతిని కాకుండా రాత పరీక్ష ద్వారా నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష తప్పనిసరి : ఏపి ప్రభుత్వం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 05:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)