గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సోనల్‌ దినుషాకు ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు

1 గంట క్రితం

Sonal-Dinusha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 05:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు శ్రీలంక మిడిలార్డర్‌ బ్యాటర్‌ సోనల్‌ దినుషాకు లభించింది. అవార్డు రేసులో ఇంగ్లాండ్ పేసర్‌ ఓల్లీ రాబిన్సన్‌, బంగ్లాదేశ్‌ సంచలన పేసర్‌ హసన్‌ మహముద్‌ పోటీపడినప్పటికీ.. దినుషానే ఈ అవార్డు వరించింది. దినుషా భారత్‌తో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 140 సగటున ఏకంగా 420 పరుగులు (3 శతకాలు, ఓ హాఫ్‌ సెంచరీ) సాధించగా.. పాకిస్తాన్‌తో జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో రాబిన్సన్‌ 16 వికెట్లు తీశాడు. హసన్‌ మహముద్‌ ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 9 వికెట్లతో చెలరేగి, ఆసీస్‌ గడ్డపై బంగ్లాదేశ్‌కు చారిత్రక విజయాన్నందించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్