శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సహకార చక్కెర కర్మాగారాలను కాపాడాలి

08 ఆగస్టు, 2026

kolu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 08:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​-ఎపి కౌలు రైతుల సంఘం డిమాండ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఉన్న మూడు సహకార చక్కెర ఫ్యాక్టరీలను లిక్విడ్ చేసి ఎపిఐఐసికి అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఎపి కౌలు రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి బలరాం, ఎం హరిబాబు పేర్కొన్నారు. సహకార ఫ్యాక్టరీలకు యజమానులే రైతులని వారితో సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సహకార చట్టాల స్ఫూర్తికి భిన్నమైందని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. గతంలో చంద్రబాబు హయాంలో అనేక సహకార చక్కెర ఫ్యాక్టరీలు, రైస్ మిల్లులను ప్రయివేటీకరించారని తెలిపారు. వందలాది ఎకరాల భూములు, లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రజల ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. సహకార చక్కెర పరిశ్రమలను కాపాడి రైతులు, కార్మికుల, ప్రజలకు ఉపయోగపడే చర్యలను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నెల్లూరులో చక్కెర పరిశ్రమను ప్రయివేటు వ్యక్తులకు అప్పజెప్పాలని చూశారని, కోర్టుకెళ్లి ప్రయివేటీకరణను రైతులు కాపాడుకున్నారని తెలిపారు. అయినా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని, ఇప్పటికైనా పునరాలోచించి చక్కెర పరిశ్రమలను ప్రయివేటీకరణను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయ డెయిరీ చైర్మన్ ను బలవంతంగా రాజీనామా చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా అభివర్ణించారు. చంద్రబాబు తనహెరిటేజ్ పాల ఉత్పత్తులతో వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవడానికి విజయ డెయిరీని ముంచే పనులు చేయడం దుర్మార్గమని విమర్శించారు. మానవత్వం లేకుండా ఆస్పత్రిలో ఉన్న వ్యక్తితో రాజీనామా చేయించడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్