శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విస్తృతంగా సిపిఎం ప్రచారం

21 అక్టోబర్, 2026

విస్తృతంగా సిపిఎం ప్రచారం
- ప్రజా పోరాటాలకు మద్దతు
- సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు వి రాంభూపాల్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రజా పోరాటాలకు మద్దతు

- సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు వి రాంభూపాల్‌

ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా పాల్గొంటున్నారు. ఒకే కార్యాచరణతో బుధవారం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల్లో తమ వాణిని బలంగా వినిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి.

అనంతపురం మున్సిపల్‌ ఎన్నికల్లో సిపిఎం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించి, ప్రజా పోరాటాలకు మరింత మద్దతు ఇవ్వాలని సిపిఎం రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు వి రాంభూపాల్‌ ‌కోరారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు మద్దతుగా ఆయా వార్డుల్లో విస్తృతంగా చేపట్టారు. 60వ డివిజన్‌కు పోటీ చేస్తున్న సి గీతాను, 62వ డివిజన్‌‌లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి ఎ గుల్జార్‌‌ను, 25వ డివిజ‌న్‌కు పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి సాకే సరస్వతిని గెలిపించాలని ఆయన కోరారు. అంబేద్కర్ నగర్ 25వ డివిజన్‌‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి రాంభూపాల్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల కోసం పని చేసే సిపిఎం అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రజా పోరాటాలకు మరింత మద్దతు ఇవ్వాలన్నారు. 62వ డివిజన్‌‌లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జి ఓబులు, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

​​తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో 20వ వార్డు సిపిఎం అభ్యర్థి దగ్గు అశోక్ కుమార్ ప్రచారం నిర్వహించారు.

​విశాఖ జివిఎంసి 77వ వార్డు సిపిఎం అభ్యర్థి ఆర్‌‌ విమల విజయాన్ని కాంక్షిస్తూ త్రినాథపురంలో ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు ప్రారంభించారు. డెయిరీ కాలనీలో 96వ వార్డు సిపిఎం అభ్యర్థి డి రమణ, దుర్గా నగర్, అరుణోదయ కాలనీ, సుందరి కాలనీలో 98వ వార్డు సిపిఎం అభ్యర్థి ఎంరాంబాబు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. 13వ వార్డులో సిపిఎం అభ్యర్థి సంగరెడ్డి గౌరీ.. ఎస్‌జి నగర్, రవీంద్ర నగర్, శాంతినగర్‌లలో, దేవేందర్ నగర్, శ్రీనగర్, రెడ్డి కంచరపాలెం కొత్త వాడ వీధి, జాషువా నగర్, తిక్కవాని పాలెం,ధ ర్మా నగర్ ప్రాంతాలలో 64వ వార్డు సిపిఎం అభ్యర్థి గల్లా పావని ప్రసన్నగౌరి, 105 వార్డులో సిపిఎం అభ్యర్థి కృష్ణయ్య, 2వ వార్డులో ఆర్‌ఎస్‌ఎస్‌ మూర్తి ఇంటింటి ప్రచారం చేశారు.

​పార్వతీపురం మన్యం జిల్లా 7వ వార్డు సిపిఎం కౌన్సిలర్‌ అభ్యర్థి బి జయలక్ష్మి తరఫున సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సుబ్బరావమ్మ ప్రచారం చేశారు. 8వ వార్డు సిపిఎం అభ్యర్థి జలగడుగులు రాణి ప్రచారం చేశారు.

నెల్లూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 37 డివిజన్ కార్పొరేటర్ సిపిఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన షేక్ రఫీ.. వి మాలకొండ రెడ్డి నగర్, గాంధీనగర్ ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్