ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి పంట మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకూ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు వ్యవసాయశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. జులై 31తో ముగియాల్సిన గడువును రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో 15 రోజులపాటు పొడిగించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయశాఖ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు బీమా సంస్థలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, పోర్టల్‌పై రద్దీని నివారించేందుకు వీలైనంత త్వరగా నమోదు చేసుకోవాలని సూచించారు.
పంటల బీమా నమోదు గడువు పొడిగింపు
31 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 01, 2026, 12:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)