మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionDenmark Open:శ్రీకాంత్‌, తాన్వీ శర్మ శుభారంభం

1 గంట క్రితం

1200x900-px-9_10.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 10:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • లక్ష్యసేన్ ఓటమి

  • డెన్మార్క్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌-750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్ అనూహ్యంగా తొలిరౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. మంగళవారం నుంచి ప్రారంభమైన డెన్మార్క్‌ ఓపెన్‌లో లక్ష్యసేన్ తొలిరౌండ్‌లో చైనీస్‌ తైపీకి చెందిన ఛౌ-టిన్‌-చెన్‌ చేతిలో పోరాడి ఓడాడు. హోరాహోరీగా సాగిన ఈ గేమ్‌లో లక్ష్యసేన్ 18-21, 21-13, 15-21మూడుసెట్ల పోరులో ఓటమిపాలయ్యాడు. తొలి గేమ్‌ను పోరాడి ఓడిన లక్ష్యసేన్ రెండో గేమ్‌ను చేజిక్కించుకొని ఫామ్‌లోకి వచ్చాడు. ఇక మూడో, చివరి గేమ్‌లోనూ పోరాడినా.. తనకంటే ర్యాంకింగ్స్‌లో ముందున్న ఛౌ-టిన్‌ చేతిలో ఓడాడు. బిడబ్ల్యుఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ లక్ష్యసేన్ ప్రపంచ 92వ ర్యాంకర్‌, అమెరికాకు చెందిన గారెట్‌ టాన్‌ చేతిలో 21-19, 19-21, 17-21తో పరాజయం పాలయ్యాడు. ఇక కిదాంబి శ్రీకాంత్‌ 22-20, 21-19తో ఫ్రాన్స్‌కఉ చెందిన ఆర్మడ్‌ మెర్కెల్‌పై గెలుపొందాడు. ఇక మహిళల సింగిల్స్‌లో తాన్వీ శర్మ 21-17, 16-21, 21-19తో జపాన్‌కు చెందిన నట్క్సుకిని చిత్తుచేసి రెండోరౌండ్‌కు చేరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్