మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం నాయకులు అప్పలరాజు గృహ నిర్బంధం

1 గంట క్రితం

సిపిఎం నాయకులు అప్పలరాజు గృహ నిర్బంధం 
-ఆర్సెలార్ మిట్టల్ పోర్ట్ ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో దుశ్చర్య image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆర్సెలార్ మిట్టల్ పోర్ట్ ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో దుశ్చర్య

ప్రజాశక్తి - ఎస్‌.రాయవరం (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం డిఎల్.పురం గ్రామం వద్ద ఈ నెల 15న తలపెట్టిన ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ గ్రీన్ ఫీల్డ్ క్యాప్టీవ్ పోర్ట్ ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని కోరుతూ మత్య్సకారులలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోన్న సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజును మంగళవారం ఎస్‌.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో ఆయన స్వగృహంలో పోలీసులు నిర్బంధించారు. బుధ, గురువారం కూడా ఇంటి దగ్గర నుంచి ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదని ఎస్.రాయవరం పోలీసులు ఆయనకు తెలిపారు. ఇది అప్రజాస్వామికమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న వారిని గొంతునొక్కే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసమని అప్పలరాజు ప్రశ్నించారు. నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు.

​ప్రభుత్వ, పోలీసుల తీరు దారుణం

అప్పలరాజును పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని సిపిఎం జిల్లా కమిటీ ఖండించింది. అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి జీవనోపాధి పరిరక్షణ కోసం పోరాడటం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యతని, అలాంటి హక్కులను పోలీసుల ద్వారా అడ్డుకోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. ప్రజలకు, మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా 15న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మిట్టల్ పోర్టు నిర్మాణంతో సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల ఉపాధికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్