న్యూఢిల్లీ : కేంద్ర సమాచార, ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి ఎల్ మురుగన్ రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మురుగన్ లేఖ రాశారు. 2029 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో బిజెపిని బలోపేతం చేసే ఉద్దేశంతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు. బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో పనిచేసిన ఆయన మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2030 వరకూ ఉంది. బిజెపి బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేయాల్సివున్నుందున ఈ పదవుల నుంచి తనను తక్షణమే విముక్తి చేయాలని ఆయన కోరారు.
Print Editionకేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ రాజీనామా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 11:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)