మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమద్యం కేసులో చట్ట ప్రకారమే సిట్‌ నోటీసులు

1 గంట క్రితం

ap-high-court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 11:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • స్పష్టం చేసిన హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : మద్యం అక్రమ రవాణా కేసులో విచారణకు హాజరుకావాలని నిందితులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నోటీసులు జారీ చేయడం సబబేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, గతంలో జారీ చేసిన నోటీసు గడువు ముగిసినందున, తాజాగా నోటీసులు ఇచ్చేటప్పుడు చట్టం నిర్దేశించిన విధానాలను తప్పనిసరిగా అనుసరించాలని సిట్‌ అధికారులను ఆదేశించింది. వాట్సాప్‌, ఇ-మెయిల్‌ ద్వారా కాకుండా చట్ట ప్రకారం నోటీసులు జారీ చేయాలని, విచారణకు అధికారులకు సహకరించాలని కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ఆదేశించింది. సిట్‌ అధికారులు గత నెల 28న వాట్సాప్‌ ద్వారా పంపిన నోటీసులను సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ గంధం సునీత, గతంలో ఇచ్చిన నోటీసు గడువు ముగిసిన నేపథ్యంలో తాజా నోటీసులు చట్టబద్ధమైన విధానంలోనే జారీ చేయాలని ఉత్తర్వులిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్