రాజమహేంద్రవరం : పశ్చిమగోదావరిలోని ధవళేశ్వరంలో క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్ శనివారం ప్రారంభించారు. సాంస్కృతిక, వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలని అన్నారు. అనంతరం భార్య అన్నా లెజినోవాతో కలిసి సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల చేతి వృత్తి కళాకృతులను పరిశీలించారు. వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను పవన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేలమంది కళాకారుల కుటుంబాలకు కలప ముడిసరకును అందించనున్నాయి. రాజమహేంద్రవరం సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులో ప్రస్తుతం 30 క్యూబిక్ మీటర్ల కలపను కళాకారుల కోసం అందుబాటులో ఉంచారు. వచ్చే ఐదేళ్లకు సరిపడా కలపను త్వరలో అందుబాటులో ఉంచుతామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన డిప్యూటీ సిఎం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 03:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)