శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నరసరావుపేటలో వింత ఘటన

1 గంట క్రితం

narasarao peta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 04:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం


నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేటలో వింత ఘటన చోటుచేసుకుంది. చేతబడి చేస్తారన్న భయంతో చోరీ చేసిన సొమ్ములో తమ వాటాగా వచ్చిన నగదును దొంగలు తిరిగి యజమానికి అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జులై 30న నరసరావుపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి 317 గ్రాముల బంగారం, రూ.21.5 లక్షల నగదును అపహరించారు. చోరీ జరిగిన అనంతరం బాధితులు దొంగల ఆచూకీ తెలుసుకునేందుకు ఓ మంత్రగాడిని సంప్రదించి అంజనం వేయించినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్‌లో నివసించే వారిలోనే కొందరు చోరీకి పాల్పడి ఉండవచ్చని మంత్రగాడు చెప్పినట్లు బాధితులు అపార్ట్‌మెంట్‌ వాసులకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న దొంగలు తమ వాటాగా వచ్చిన రూ.19 లక్షలను ఓ చెప్పుల స్టాండ్‌లో ఉంచి, తమను క్షమించాలని కోరుతూ ఓ లేఖను కూడా వదిలి వెళ్లారు. లేఖను పోలీసులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించి, దానిపై ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్