ప్రజాశక్తి-కాకినాడ : స్థానిక సుందరయ్య భవన్ లో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం నాయకులు కె. వీరబాబు అధ్యక్షతన జరిగిన సభలో కరణం ప్రసాదరావు మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్ళు అయినా పాలకుల విధానాల వల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగిందన్నారు. దేశ స్వతంత్ర్యం కోసం ప్రాణాలు సైతం అర్పించిన వారి ఆశలు కలలుగానే మిగిలిపోయాయన్నారు. మోడీ నేత్రుత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. మతోన్మాదంతో ప్రజల మధ్య చీలికలు తీసుకుని వస్తోందని విమర్శించారు. విద్య, వైద్యం వ్యాపార సరుకు గా మారిందని, ఆర్ధిక అసమానతలు బాగా పెరిగి పోయాయన్నారు. గత 2 దశాబ్దాలుగా వ్యవ సాయ రంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుండగా, లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. డా. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని ఎప్పటి నుండో రైతాంగం కోరుతుందన్నారు. గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికుల జీవించే హక్కును హరిస్తూ 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో విబి రామ్‌జీ చట్టం 2025 తేవడం గ్రామీణ ఉపాధిని నాశనం చేయడమేనని ప్రసాదరావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ప్రజలంతా పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె. ఎస్. శ్రీనివాస్, పి. వీరబాబు, సిహెచ్. రాజకుమార్, సిహెచ్ అజయ్ కుమార్, మలక రమణ, మేడిశెట్టి రమణ, ఎన్. సూర్య నారాయణ, ఎ.ఏడుకొండలు, రాణి, వి. చంద్రరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
సుందరయ్య భవన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)