-- నేడు అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు
-- సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ
కేంద్ర విద్యా శాఖమంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థుల ఘన విజయమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. జాతీయ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 49 రోజులపాటు విద్యార్థులు, యువకులు, వారి తల్లిదండ్రులు పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కేంద్ర విద్యాశాఖామంత్రిగా మరో బిజెపి నాయకుడు ప్రహ్లాద్ జోషిని తీసుకురావడం సమంజసంకాదని విమర్శించారు. దేశంలో రాజ్యాంగం, లౌకికవాదం విద్యారంగంలో చోటుచేసుకోవాలంటే విద్యా శాఖా మంత్రి పదవిని బిజెపికి కాకుండా ఎన్‌డిఎలో ఉన్న లౌకిక పార్టీలు టిడిపి, జెడియులకు ఇవ్వాలని ప్రధాని మోడీని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్‌టిఎను రద్దు, ఎన్ఇపిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో 27న అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చామని పేర్కొన్నారు. పార్టీలను చీల్చి, ఫిరాయింపులను ప్రోత్సహించి తమకు అ నుకూలంగా మెజార్టీ తెచ్చుకోవడానికి మోడీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు.







కామెంట్‌లు (0)