ఇరాన్ టెహ్రాన్ : తమ షరతులు నెరవేరే వరకు హర్మూజ్ జలసంధిని పున:ప్రారంభించమని ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఘలిబాఫ్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతు ఇరాన్ డిమాండ్ల విషయంలో అమెరికా ఇకపై కాలయాపన చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు. ఒక మధ్యవర్తి ద్వారా అమెరికా కొన్ని ప్రతిపాదనలు చేసిందని ఆయన తెలిపారు. ‘‘ఇలా కాలయాపన చేస్తూ, ఏకపక్ష డిమాండ్లను ఇతర మీద రుద్దే శకం ముగిసిందని అమెరికా తెలుసుకోవాలి’’ అని ఘాలిబాఫ్ అన్నారు. ఇరాన్ వైఖరి ‘‘స్పష్టంగా, నిశ్చయంగా’’ ఉందని ఆయన తెలిపారు. మా ఏడు షరతులు నెరవేరే వరకు హర్మూజ్ జలసంధి తెరుచుకోదని అన్నారు. ఇరాన్ ఇప్పటికే యుద్ధరంగంలో ఉందని, కొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను ఎదుర్కొంటుందని చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనలపై ఇరాన్‌కు ఉత్సాహం లేదా భయం గానీ లేవని తెలిపారు. ఇరాన్ పోరాటమూ, చర్చలూ రెండింటినీ నిర్వహిస్తుందని తెలిపారు. ఆదివారం నాడు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి మాట్లాడుతూ ‘‘మమ్మల్ని మేము రక్షించుకోవడంలో ఎంత నిబద్ధతతో ఉన్నామో, దౌత్యపరమైన పరిష్కారాలను కనుగొనడంలో కూడా ఇరాన్ అంతే నిబద్ధతతో ఉంది’’ అని అన్నారు. టెహ్రాన్‌లో విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలతో మాట్లాడుతూ అరాఘ్చి ఈ విషయాన్ని తెలిపారు. జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ తన షరతులను అమెరికాకు స్పష్టంగా వివరించిందని, అమెరికా తమ ప్రతిపాదనను అంగీకరిస్తుందని ఇరాన్ ఆశిస్తోందని అరాఘ్చి తెలిపారు. ఒకవేళ అమెరికా మళ్లీ సైనిక చర్యకు దిగితే, ఇరాన్ ‘‘గతంలో కంటే మరింత సిద్ధంగా ఉందని, తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన ఎలాంటి చర్య అయినా తీసుకుంటుందని’’ అరాఘ్చి హెచ్చరించారు.
మా షరతులు నెరవేరే వరకూ హర్మూజ్‌ను తెరవం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 05, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)