ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాఉద్యమాలకు ఐలు బాసటగా నిలవాలి

1 గంట క్రితం

ప్రజాఉద్యమాలకు ఐలు బాసటగా నిలవాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 12:36 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- జాతీయ ఉపాధ్యక్షురాలు, మద్రాసు హైకోర్టు న్యాయవాది శంకీరాజ్

- రాష్ట్ర మహాసభలో 14 తీర్మానాలు ఆమోదం

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : ప్రజా ఉద్యమాలకు ఐలు బాసటగా నిలవాలని ఐలు జాతీయ ఉపాధ్యక్షురాలు, మద్రాసు హైకోర్టు న్యాయవాది శంకీరాజ్ అన్నారు. ఐలు 13వ రాష్ర్ట మహాసభలో ఆదివారం ఆమె ప్రసంగించారు. సంఘాన్ని బలోపేతం చేయాలని, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నాయని, ఐలు సభ్యులు, న్యాయవాదులు అందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఐలు నాయకులు విలువలు, విశ్వసనీయతకు కట్టుబడి ఉండాలని, అవసరమైన వారికి న్యాయపరమైన సలహాలు, సూచనలు అందజేయాలని, న్యాయవ్యవస్థకు తొడ్పడేలా జూనియర్ న్యాయవాదులకు లీగల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని సూచించారు.

న్యాయవ్యవస్థ స్వతంత్రత కాపాడాలని తీర్మానం

ఐలు మహాసభలో 14 తీర్మానాలకు ఏకగ్రీవంగా

ఆమోదించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత కాపాడాలని, న్యాయవాదులకు రక్షణ చట్టం ఏర్పాటు చేసి, అమలు చేయాలని డిమాండ్‌ ‌చేసింది. న్యాయవాదులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలా స్టెఫండ్ ఇవ్వాలని, రీ సర్వే సవరణ చట్టం రద్దు చేయాలని, న్యాయ స్థానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని తీర్మానించారు. విశాఖ స్టీలు ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల చేసి, సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ ‌చేసింది. మానవ హక్కుల కమిషన్ అధ్యక్షులు, సభ్యులను వెంటనే నియమించాలని, జ్యుడీషియరీ అకాడమి తరహాలో అడ్వకేట్ అకాడమి ఏర్పాటు చేయాలని, ఏజెన్సీ ప్రాంతం చింతూరులో న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని, తెలంగాణ జ్యుడీషియరీ నియమాకాల్లో ఎపి రాష్ర్ట అధ్యక్షులకు అవకాశం కల్పించాలని కోరుతూ తీర్మానాలను ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం సిజిఐటి బ్రాంచ్ ను రాష్ర్టంలో ఏర్పాటు చేయాలని, నూతన కార్మిక చట్టాలు రద్దు చేయాలని, అసమ్మతి, అణచివేతలను వ్యతిరేకించాలని మహాసభ డిమాండ్‌ ‌చేసింది. ప్రజాస్వామ్య ఉద్యమాలకు న్యాయసహాయం అందించాలని తీర్మానించారు.

అనంతపురంలో ఐలు 14వ రాష్ర్ట మహాసభ

ఐలు 14వ రాష్ర్ట మహాసభను అనంతపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. ముగింపు సభలో మద్రాసు హైకోర్టు న్యాయవాది, ఐలు జాతీయ ఉపాధ్యక్షులు ఇలాంగో, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్రప్రసాద్, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, న్యాయవాది వంకి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్