శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విఆర్‌ఒ, విఆర్‌ఎ, సర్వేయర్ల సమస్యలపై త్వరలో చర్చలు

18 సెప్టెంబర్, 2026

revenue
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 11:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉద్యోగ సంఘాలతో భేటీకి మంత్రి అనగాని హామీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విఆర్‌ఒ,విఆర్‌ఎ, సర్వేయర్ల సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల నేతలతో త్వరలో సమావేశాన్ని నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన అనంతరం సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) ఛైర్మన్ రవీంద్రరాజు నేతృత్వంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు శుక్రవారం సచివాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కు వినతిపత్రాన్ని అందించారు. విఆర్‌ఒలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించే ప్రమోషన్ ఛానల్‌లో రేషియో పెంచాలని కోరారు. విఆర్ఎలకు పే స్కేల్ వర్తింపజేయడంతో పాటు గతంలో నిలిపివేసిన డిఎలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సర్వేయర్ల పే స్కేల్ పెంచి, డైలీ, ట్రావెల్ అలవెన్స్ సౌకర్యాలను కల్పించాలని ఉద్యోగ సంఘాల నేతలు మంత్రిని కోరారు. ఆయా సమస్యలపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఏర్పాటు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు తెలిపారు. ఇప్పటికే విఆర్ఎలు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన చేస్తున్నారని జెఎసి ఛైర్మన్ రవీంద్రరాజు తెలిపారు. సర్వేయర్లు తమ డిమాండ్ల సాధనకు సహాయ నిరాకరణ చేపట్టనున్నట్లు నోటీసులు ఇచ్చారని చెప్పారు. విఆర్‌ఒలు ఉద్యమానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్