మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకాకినాడ జిల్లాలోని చౌక డిపోల్లో స్టీమ్ రైస్ పంపిణీ : మంత్రి నాదెండ్ల

57 నిమిషాల క్రితం

nadendla-manohar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 09:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కాకినాడ జిల్లాలోని చౌక డిపోల్లో స్టీమ్ రైస్ పంపిణి చేస్తున్నామని ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఎపి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే తొలిసారి కాకినాడ జిల్లాలో చౌక డిపోల్లో స్టీమ్ రైస్ పంపిణీ అమలు చేస్తున్నామని అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా 9 వేల మెట్రిక్ టన్నులు ప్రతినెలా అందజేస్తామని, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో డిజిటల్ వాలెట్‌‌కు శ్రీకారం చుట్టామన్నారు. త్వరలో చౌక డిపోల్లో కందిపప్పు అందిస్తామని, తక్కువ ధరకే 70 సరకులతో 1000 మీ మార్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆగస్టు ఒకటి నుంచి తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 ప్రత్యేక అవుట్ లెట్ల ద్వారా బహిరంగ మార్కెట్లో రూ.62 నుంచి రూ.64 ఉన్న బిపిటి స్టీమ్ రైస్‌ను రూ.52లకు, బహిరంగ మార్కెట్లో రూ.58 ధర ఉన్న గ్రేడ్ 1 రా రైస్‌ను రూ.50లకు అందించాలని నిర్ణయించామన్నారు. చౌక డిపోల్లో అందిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని ప్రజలు ఎందుకు వినియోగించడం లేదు..? ప్రతి కేజీ మీద రూ.56 రాయితీని వెచ్చిస్తుంటే ఆ బియ్యం ప్రజలకు ఎందుకు అక్కరకు రాకుండా పోతున్నాయి..? అనే విషయం మీద రాష్ట్ర పౌర సరఫరాలశాఖ లోతుగా అధ్యయనం చేసిందన్నారు. నిపుణులు, ఆర్థిక వేత్తలు, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత ప్రజా పంపిణీలో ఇప్పుడు అందిస్తున్న బియ్యం స్థానంలో, తినేందుకు బాగా అనువుగా ఉండే స్టీమ్ రైస్ అందిస్తే వినియోగం పెరుగుతుందని తేలిందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతుందని, బియ్యం పక్కదారి పట్టడం తగ్గుతుందని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్