ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవంద శాతం సంతృప్తి రావాలి

16 జులై, 2026

dola
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 11:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో రాజీ పడొద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారుల్ని ఆదేశించారు. తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌లో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, డిసిఒలు, ఎఎస్‌‌డబ్ల్యుఒలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌‌ను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాల్లో పారిశుధ్య నిర్వహణ, సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో వంద శాతం సంతృప్తి రావాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీతో పారిశుధ్య సిబ్బందిని నియమించామని, అన్ని వసతి గృహాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని, అలాగే 10 శాతం డైట్ చార్జీలు పెంచామని వెల్లడించారు. విద్యార్థులకు నైట్ డ్రెస్, బెడ్, మస్కిటో మెస్ లు, టవళ్లు వంటి అన్నింటినీ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం నాయక్ , డైరెక్టర్ బి. లావణ్య వేణి, ఎపిఎస్‌‌డబ్యుఆర్‌ఇఐఎస్‌ కార్యదర్శి వి. ప్రసన్న వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సునీల్ రాజ్ కుమార్, డిడిలు, డిసిఒలు, ఎఎస్‌‌డబ్ల్యుఒలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్